వీరిద్ద‌రి మ‌ధ్య అస‌లేం జ‌రిగిందంటే?

July 19, 2020 at 6:44 pm

అందాల ‘చందమామ’ ఎవరంటే కాజల్ అగర్వాల్ అని ఇట్టే చెప్పేస్తారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కల్యాణం’ ద్వారా వెండితెరపై అడుగు పెట్టింది. అటు తర్వాత చిత్రసీమలో రెండు దశాబ్దాలుగా పలు భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోలు, కుర్ర హీరోలు అని తేడాలేకుండా అందరితో కలిసి ఆడి పాడింది. ఇక అసలు విషయానికి వద్దాం… తనను సినిమా రంగానికి పరిచయం చేసిన గురువు లాంటి దర్శకుడు తేజ తన కొత్త చిత్రం ‘అలమేలు మంగ వెంకట రమణ’లో కాజల్ ను ‘అలమేలు మంగ’ పాత్రలో నటింపజేయాలనుకున్నాడు.

గోపిచంద్‌ హీరోగా నటించనున్నఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడు తేజ ఈ సినిమా కోసం మొదట కాజల్ అగర్వాల్‌ను సంప్రదించడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో అయితే ఈ కబురు మరీ వైరల్ అయింది. అయితే కొద్ది రోజులుగా కాజల్ ఈ సినిమాలో నటించడం లేదనే వార్తలు టాలీవుడ్ లో గుప్పుమంటున్నాయి. అసలేం జరిగిందో తెలియక ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే..

కాజల్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని కొందరు, తేజ మరీ తక్కువ పారితోషికం ఆఫర్ ఇవ్వడంతో ‘అలమేలు మంగ’ క్యారక్టర్ చేయాల్సిన అందాల ‘చందమామ’ అలిగిందని మరి కొందరు. ఇలా.. ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఊహించుకున్నారు. కాజల్ పొగరుగా ప్రవర్తించడంతో చిరాకు పడ్డ దర్శకుడు తేజ, ఈ సినిమా కోసం కాజల్‌ను పక్కన పెట్టి మరో స్టార్ హీరోయిన్ ను సంప్రదించినట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ‘అలమేలు మంగ’గా నటించే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఇంతకీ తేజ-కాజల్ మధ్య ఏం జరిగింది? ఈ విషయంలో దర్శకుడు తేజ ప్రకటన చేయాల్సివుంది!

వీరిద్ద‌రి మ‌ధ్య అస‌లేం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts