`వీర`‌గా ప‌వ‌ర్‌స్టార్‌

July 18, 2020 at 8:57 am

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పేరు వింటే చాలు వైబ్రేష‌న్స్ మొద‌ల‌వుతాయి. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతుంది. క్రిష్ ద‌ర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మాతగా ఓ పీరియాడిక్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. లాక్ డౌన్ కి ముంది దర్శకుడు క్రిష్ కొంత మేర షూటింగ్ జరిపారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారని సమాచారం. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది.

పవన్ ఈ చిత్రంలో బొందిపోటు పాత్ర చేస్తున్నారు. అలాగే ఆ పాత్ర పేరు వీర అని ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇక ఈ పీరియాడిక్ మూవీలో జాక్విలిన్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. కాగా పవన్ వకీల్ సాబ్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. హరీష్ శంకర్ తో చేస్తున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. మ‌రి వ‌కీల్ సాబ్ త‌ర్వాత ప్ర‌స్తుతం లైన్‌లో ఉన్న మూవీ వీర‌. ఇక క‌రోనా కాలం కాస్త పూర్త‌యితే ప‌వ‌న్ వ‌రుస సినిమాల‌తో ద‌డ‌ద‌డ‌లాడిస్తార‌న‌మాట‌.

`వీర`‌గా ప‌వ‌ర్‌స్టార్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts