వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన ప్రకాశ్ రాజ్

July 1, 2020 at 9:18 pm

ప్రస్తుతం ఎటు చూసినా డిజిటల్‌ ప్రపంచమే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్స్‌ కి ఫిదా అవుతున్నారు. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతబడడంతో చాలామంది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం వైపు నటీనటులందరూ చూస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సీరీస్ లో నటించడానికి ఆర్టిస్టులు తెగ ఆసక్తి చూపుతున్నారు. లాక్ డౌన్ కి ముందు నుంచీ కొందరు తారలు వెబ్ సీరీస్ లో నటించడానికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది మరింత ఎక్కువైంది. ఆకర్షణీయమైన పారితోషికాలతో పాటు మంచి క్యారెక్టర్లు పోషించే అవకాశాలు రావడంతో వెబ్ సీరీస్ లో నటించడానికి బిజీ తారలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు.

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ప్రకాశ్ రాజ్ కూడా తొలిసారిగా వెబ్ సీరీస్ లో నటించడానికి రెడీ అయ్యారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించడానికి ప్రకాష్‌రాజ్‌ ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. అంతేకాదు, దానికి స్క్రిప్టు కూడా ఆయనే ఇచ్చారట. ఈ మధ్య కాలంలో దేశంలోని పలుచోట్ల చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆదారంగా ఈ వెబ్ సీరీస్ రూపొందుతోందని తెలుస్తోంది.

వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన ప్రకాశ్ రాజ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts