వ‌ర్మ కార్యాల‌యం పై ప‌వ‌న్ అభిమానుల దాడి!

July 23, 2020 at 10:37 pm

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ `ప‌వ‌ర్ స్టార్` టైటిల్ తో సినిమా రిలీజ్ చేస్తున్న‌ నేప‌థ్యంలో ప‌వన్ అభిమానుల్ని వ‌ర్మ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో వ‌ర్మ స‌వాల్ విసిరాడు. ఎవ‌డొస్తాడో? ర‌ండి నా ఆఫీస్ అంద‌రికీ తెలు‌సు. గుగూల్ మ్యాప్ లో సెర్చ్‌ చేస్తే దొరుకుతుంది. దాడి చేస్తే చూస్తూ ఊరుకోవ‌డానికి చేతుల‌కు గాజులు తొడుక్కో లేదు. రండి ద‌మ్ముంటే చూసుకుందాం అని స‌వాల్ విసిరారు. ఆ స‌వాల్ నేడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. తాజాగా ఆ స‌వాల్ ని వ‌ర్మ అభిమానులు స్వీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే హైద‌రాబాద్‌లో బంజారా హిల్స్‌లోని ఎమ్మెల్యే క్వాట‌ర్స్‌లో ఉన్న ఆర్జీవీ కంపెనీ కార్యాల‌యంపై దాడి జ‌రిగింది.

కొంత మంది దుండ‌గ‌లు దాడి చేసారు. వాళ్లంతా క‌చ్చితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ అని స‌మాచారం. వ‌ర్మ స‌వాల్ విసిరాడు కాబ‌ట్టే వ‌చ్చి దాడి చేసార‌ని కొంద‌రంటున్నారు. అయితే ఇంకా పూర్తిగా దాడికి సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. ప‌వ‌న్ అభిమానులు చేసారా? ఇంకెవరైనా ఉద్దేశ పూర్వ‌కంగా దాడి చేసారా? అన్న అనుమానం కూడా వ్య‌క్తం అవుతోంది. ఆ స‌మ‌యంలో వ‌ర్మ ఆఫీస్ లో ఉన్నారా? లేరా? అన్న వివ‌రాలు కూడా ఇంకా తెలియ‌లేదు. `ప‌వ‌ర్ స్టార్` సినిమాని వ‌ర్మ శుక్ర‌వారం ఆర్జీవీ వ‌ర‌ల్డ్ ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌చార చిత్రాల‌పై ప‌వ‌న్ అభిమానులు మండిప‌డ్డారు.

ఎవ‌రూ రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని నిర్మాత‌ల నుంచి ఒత్తిళ్లు వెళ్లాయి. దీంతో రిలీజ్ కు ముందుకు వ‌చ్చిన శ్రేయాస్ మీడియా వెన‌క్కి త‌గ్గింది. దీంతో వ‌ర్మ సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. ఇంత‌లో ఆయ‌న ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డం స‌వాల్ విస‌రడం.. అభిమా నులు స్వీక‌రించ‌డం…దాడి చేయ‌డం జ‌రిగింది. ఇలాంటి దాడులు వ‌ర్మ‌కు కొత్తేం కాదు..సినిమా రిలీజ్ ల కోసం బెజ‌వాడ‌లోనే రోడ్డెక్కి ర‌చ్చ చేసారు. పంచాయ‌తీల‌కు పోలీస్ స్టేష‌న్ల‌కు వెళ్లిన సంద‌ర్భాలున్నాయి. మీడియా డిబేట్ల‌లోనూ వ‌ర్మ అంతే ఆస‌క్తిగా పాల్గొంటారు.

వ‌ర్మ కార్యాల‌యం పై ప‌వ‌న్ అభిమానుల దాడి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts