శ్ర‌ద్ధా ఏంటి ఇంత కోపంగా ఉంది… ఎవ‌రిపైన అబ్బా?

July 19, 2020 at 5:39 pm

ఛీ.. సోషల్ మీడియా అంటోంది శ్రద్ధాదాస్.. అవును.. శ్రద్దాదాస్ నిజమే చెబుతోంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ”ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు కామెంట్స్ పెడుతూ నెటిజనులు సోషల్ మీడియా పరువును మంటగలుపుతున్నారు. ఓ పద్ధతీ, పాడు అంటూ ఏదీ లేదు. ప్రతీ దానికి స్పందించడమే! అవసరం ఉన్నా, లేకపోయినా కామెంట్ చేశామా? లేదా? అన్నదే చూస్తున్నారు.

ఛీ.. ఎంతగా దిగజారి పోయారు జనాలు” అంటూ శ్రద్ధాదాస్ నెటిజనులపై తెగ విరుచుకుపడింది. ఇలాంటి కామెంట్లపై వెరైటీగా సెటైర్స్ వేసింది. పరోక్షంగా ఇండస్ట్రీ ప్రముఖులపై కూడా కౌంటర్ లు పోస్ట్ చేసింది. శ్రద్దా పోస్టులు చూస్తుంటే.. నెపోటిజంపై జరుగుతున్న చర్చలను చూసి విసిగిపోయినట్లు అనిపించింది.

‘సినిమా రంగంలో ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఛాన్స్ ఇస్తారని, అదే కొత్త వారు మాత్రం ఎన్నో ప్రయాసాలు పడాలి’ అని శ్రద్దాదాస్ చెప్పుకొచ్చింది. ఓ పెద్ద సినిమాలో అవకాశం రావాలన్నా, పెద్ద డైరెక్టర్లను అప్రోచ్ కావాలన్నా కొత్తగా వచ్చిన వారికి చాలా కష్టమంటూ నెపోటిజాన్ని వ్యతిరేకిస్తూ శ్రద్దాదాస్ ట్వీట్స్‌ కనిపించాయి. ఇంతకీ శ్రద్దా రెచ్చిపోయింది ఎవరిపై?! ఈ ఆవేశం, కోపం ఎవరిపై? అవకాశాలు ఇవ్వడం లేదని ఇండస్ట్రీ పైనా? లేక దర్శక నిర్మాతలపైనా?

శ్ర‌ద్ధా ఏంటి ఇంత కోపంగా ఉంది… ఎవ‌రిపైన అబ్బా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts