సంపాద‌న ఎలానో తెలియ‌క‌పోతే ఎలా జ‌న‌సేనాని?

July 23, 2020 at 10:44 pm

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న డిఫ‌రెన్స్ ఏమిటో చెప్ప‌గ‌ల‌రా? ఆ ఇద్ద‌రూ ఎవ‌రూ ఎవ‌రికీ తీసిపోని బిగ్ స్టార్స్.. కానీ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారికంలో మాత్రం ఇరువురి మ‌ధ్యా చాలా వ్య‌త్సాసం ఉంది. మ‌హేష్ ఫ‌క్తు బిజినెస్ మేన్ లా కార్పొరెట్ గురూలా వ్య‌వ‌హ‌రిస్తాడు. సంపాద‌న‌కు ఆస్కారం ఉన్న ఏ రంగాన్ని విడిచిపెట్ట‌డు. ఇటీవ‌లే ఏఎంబీ సినిమాస్ ని ప్రారంభించిన మ‌హేష్ దానిని పెద్ద స‌క్సెస్ చేశాడు. ఇక వ‌స్త్ర వ్యాపారం పేరుతో బ్రాండింగ్ చేశాడు. ఇదేగాక‌.. ర‌క‌ర‌కాల వ్యాపారాలు చేస్తున్నాడు. జీఎంబీ బ్యాన‌ర్ ప్రారంభించి బాగానే ఆర్జిస్తున్నాడు.

దీనికి తోడు తొలి నుంచి అత‌డికి కార్పొరెట్ బ్రాండ్ల ప్ర‌క‌ట‌న‌ల‌తో భారీగా ఆర్జించిన రికార్డ్ ఉంది. ఏడాదికి ఎంత త‌క్కువ‌గా చూసుకున్నా 100 కోట్ల ఆదాయం అత‌డి ఖాతాలో కేవ‌లం బ్రాండింగ్ ద్వారానే వ‌చ్చి చేరుతుంద‌ని విశ్లేషిస్తుంటారు. కెరీర్ తొలి నాళ్ల నుంచి అత‌డు ఇదే పంథాలో ఉన్నాడు. కానీ ప‌వ‌న్ అలా కాదు. అత‌డికి డ‌బ్బు అన్న‌ది ప‌ట్ట‌దు. ఇలాంటి కార్పొరెట్ బ్రాండింగ్ ఆఫర్లు ఎన్ని వ‌చ్చినా తృణ‌ప్రాయంగా త్య‌జించాడు. ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల జీవితాలతో ఆడుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌ని సూటిగా చెప్పేశాడు. తాను ప్ర‌చారం చేస్తేనే అది మంచి బ్రాండ్ అనేది ప‌వ‌న్ న‌మ్మ‌డు.

అత‌డు దేనినీ లెక్క చేయ‌డు. త‌న‌కు తోచిన‌ట్టే జీవించ‌డం అల‌వాటు. బ్రాండ్ల పేరుతో సంపాదించుకునే ఆలోచ‌నా లేదు. బిజినెస్ లు చేసి ఎంట‌ర్ ప్రెన్యూర్ గా ఎద‌గాల‌నీ లేదు. 50 వ‌య‌సులో అత‌డు ఒక మౌనమునిలా మారాడు. నిరంత‌రం త‌న‌కు న‌చ్చిన పుస్త‌కాలు చ‌దువుకుంటూ హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లోని త‌న పాతిక ఎక‌రాల మామిడి తోట‌లో ప‌శువుల్ని కాసుకుంటూ ఎంతో సాధాసీదాగా జీవించేస్తున్నాడు అంటే అర్థం చేసుకోవ‌చ్చు. అత‌డిలో ఆధ్యాత్మ‌క ప్ర‌వృత్తి మ‌రీ ఎక్కువ‌. ఇంత‌కుముందు కాశీ-వార‌ణాసికి వెళ్లి ఒక సాధువులా జీవించి తిరిగి వ‌చ్చాడు. ఇటీవ‌లే రాజ‌కీయాల‌కు కామా పెట్టి తిరిగి సినిమాల‌తో బిజీ అయ్యాడంటే అది సంపాద‌న‌పై యావ‌తో కాదు. రాజ‌కీయ పార్టీని కాపాడుకోవ‌డానికి ఆఫీస్ మెయింటెనెన్స్ కి ఆదాయం కావాలి కాబ‌ట్టి. లేదంటే అస‌లు సంపాద‌న‌ను ప‌ట్టించుకునే వ్య‌క్తి కానే కాదు. ఆ విష‌యం అత‌డే స్వ‌యంగా చెప్పాడు కూడా. ప్ర‌స్తుతం సినిమాలు చేస్తున్నా వైర‌స్ దెబ్బ‌కు అన్నీ మూల‌న ప‌డ్డాయి. ఇక ప‌వ‌న్ కి క‌నీస‌మాత్రంగా జీవించేందుకు మెయింటెనెన్స్ కు ఆదాయం కూడా క‌ష్ట‌మే.

ఇక మ‌హేష్ జీవ‌న శైలి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇప్ప‌టికీ మ‌హేష్ సినిమాల‌తో బిజీ బిజీ. ఈ మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ స‌మ‌యంలోనూ అత‌డు వ‌రుస‌గా బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ తో సంపాదిస్తూనే ఉన్నాడు. తాజాగా రిల‌య‌న్స్ జియోతో అత‌డు భారీ కాంట్రాక్టుకు సంత‌కం చేశాడ‌ని తెలుస్తోంది. ఈ డీల్ విలువ కోట్ల‌లో ఉంటుంది. జియో ఇటీవ‌లే విదేశీ కంపెనీల‌తో భారీ ఒప్పందాలు చేసుకుని బ‌ల‌ప‌డింది. ముఖేష్ అంబానీ ప్ర‌పంచ ధ‌న‌వంతుల్లోనే టాప్ 5 ఆర్జ‌న‌తో టాప్ లేపేస్తున్నాడు. ఇప్పుడు దేశంలో జియో బ్రాండ్ ని మ‌రింత బ‌ల‌ప‌ర్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో జియో బ్రాండ్ ని మ‌హేష్ త‌న ఖాతాలో వేసుకున్నాడంటే అర్థం చేసుకోవ‌చ్చు. ప‌వ‌న్ సంగ‌తి అటుంచితే.. ర‌జ‌నీకాంత్ ..విజ‌య్.. ప్ర‌భాస్ స‌హా చాలామంది చేయ‌లేనిది మ‌హేష్ చేసి చూపిస్తున్నాడు క‌మ‌ర్షియ‌ల్ కోణంలో.

సంపాద‌న ఎలానో తెలియ‌క‌పోతే ఎలా జ‌న‌సేనాని?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts