సచివాలయం కూల్చివేతను ఆపమంటూ హైకోర్ట్ రెడ్ సిగ్న‌ల్‌

July 10, 2020 at 10:33 pm

శరవేగంగా జరుగుతున్న సచివాలయం కూల్చివేత పనులను ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించింది. సోమవారం వరకు పనులు నిలిపివేయాలని హైకోర్ట్ సూచించింది. దీంతో నిర్విరామంగా జరుగుతున్న కూల్చివేత పనులకు ఆటంకం ఏర్పడ్డట్లయింది. నగరానికి చెందిన సామాజికవేత్త విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్ మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చి తదుపరి విచారణ చేపట్టేవరకు అంటే శని, ఆదివారం కోర్టుకు సెలవు కాబట్టి సోమవారం వరకు కూల్చడం ఆపాలని ఆదేశించింది.

కోర్టు నుండి కూల్చివేతకు ఆదేశాలు అందిన వెంటనే రంగంలోకి దిగిన సర్కార్ నాలుగు రోజులు నుండి కూల్చివేత పనులను రాత్రి పగలు చేస్తున్నారు. ఉదయం కూల్చడం, రాత్రి సమయాల్లో శిధిలాలను తరలించడం. నిరంతరాయంగా జరిగిన ఈ పనులతో ఇప్పటికే 60 శాతం నిర్మాణం నేలమట్టమైందని తెలుస్తోంది. ఇంకో మూడు నాలుగు రోజులు కొనసాగిస్తే మిగతా కూల్చివేత కూడా పూర్తవుతుందట. కానీ ఉన్నట్టుండి కోర్టు నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే సచివాలయ అధికారులు మాత్రం ఇంకా కోర్టు ఉత్తర్వులు తమకు చేరలేదని, అప్పటివరకు పనుకు యధాతథంగా కొనసాగుతాయని, కోర్టు ఆదేశాలు అందాక తదుపరి కార్యాచరణ చెబుతామని అంటున్నారు. సచివాలయం కూల్చివేత విషయంలో కేసీఆర్ ఎంతో పట్టుదలగా ఉన్నారు. పాతదాన్ని కూల్చి తన హయాంలోనే ఇంకో వందేళ్లు నిలబడేలా కొత్త భవంతి కట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. హైకోర్టులో సంవత్సరం పైగా పోరాడి కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కోర్టు ఆపమని ఆదేశించడంతో సీఎం ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సచివాలయం కూల్చివేతను ఆపమంటూ హైకోర్ట్ రెడ్ సిగ్న‌ల్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts