షాకింగ్ న్యూస్‌.. నగరిలో ఒకే కుటుంబానికి చెందిన‌ 22 మందికి క‌రోనా!!

July 10, 2020 at 3:39 pm

క‌రోనా వైర‌స్‌.. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైర‌స్ ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో తెలియ‌క ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అంద‌రినీ హ‌రించేస్తుంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16 వేలు దాటేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో ఒకే కుటుంబంలో 22 పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 84 ఏళ్ల వయసున్న ఒక ప్రముఖ వ్యక్తి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనారోగ్యంతో నిన్న వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు. ఆయనది ఉమ్మడి కుటుంబం.

నలుగురు కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో పట్టణంలోనే పెద్ద కుటుంబంగా పేరుంది. అయితే వారం రోజుల క్రితం ఆయన సతీమణి మృతి చెందగా అంత్యక్రియలకు తమిళనాడు నుంచి బంధువులు వచ్చినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన కుమారుడికి కరోనా సోకడంతో ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం వారి కుటుంబంలో 16 మందికి, పక్కింట్లో ఉన్న ఆయన తమ్ముడి కుటుంబంలో 6 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఒక ఇంట్లో వారం రోజుల్లోనే భార్య, భర్త మృతి చెందడం, అదే కుటుంబానికి చెందిన 22మందికి పాజిటివ్‌ రావడం నగరివాసులను కలవరపరుస్తోంది.

షాకింగ్ న్యూస్‌.. నగరిలో ఒకే కుటుంబానికి చెందిన‌ 22 మందికి క‌రోనా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts