ఆ హీరో, హీరోయిన్ రీల్ ల‌వ్ స్టోరీతో రియ‌ల్ పెళ్లికి రెడీనా…!

July 30, 2020 at 7:13 pm

సినిమా వాళ్ల ప్రేమ‌లు, పెళ్లిళ్లు ఎప్ప‌ట‌కి చిత్ర విచిత్రంగా ఉంటాయి. నాటి త‌రం సినిమా హీరోలు, హీరోయిన్ల నుంచి నేటి సూప‌ర్ స్టార్ల వ‌ర‌కు ఎంతో మంది త‌మ సినిమాల్లో త‌మ‌తో పాటు రొమాన్స్ చేసిన హీరోయిన్ల‌నే పెళ్లి చేసుకున్నారు. ఈ త‌రం సూప‌ర్ స్టార్ హీరో మ‌హేష్‌బాబు సైతం త‌న‌తో పాటు వంశీ సినిమాలో న‌టించిన మాజీ మిస్ ఇండియా న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌ను పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌తో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ లిస్టులో వ‌రుణ్ సందేశ్‌తో పాటు చాలా మందే హీరోలు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మ‌రో యంగ్ హీరో చేరిపోతున్నాడు. అత‌డే ఆది పినిశెట్టి.

ప్రతిభ గల నటుడిగా అటు కోలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో ఆది పినిశెట్టి. ఆది త‌న‌తో కలిసి రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీని వివాహం చేసుకోబోతున్నాడట. కొద్ది రోజులుగా తమిళ మీడియాలో ఆది పినిశెట్టి పెళ్లి వార్త హల్‌చల్ చేస్తోంది. కొద్ది రోజులుగా ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రే క‌నిపిస్తున్నార‌ట‌. ఇంత‌కు నిక్కీ ఎవ‌రో కాదు మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న సంజ‌న గ‌ల్రానీ సోద‌రి. ఆదితో ఆమె రెండు సినిమాల్లో నటించింది. మలుపు- మరకతమణి చిత్రాలతో ఇటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు ఈ జంట.

 

ఇక రీల్ లైఫ్ ప్రేమికులుగా ఉన్న వీరిద్ద‌రు ఇప్పుడు రియ‌ల్ లైఫ్‌లో ప్రేమికులుగా మార‌డంతో పాటు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఆది తండ్రి అయిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రవిరాజా పినిశెట్టి పుట్టిన రోజు వేడుక‌ల్లో నిక్కీ చేసిన సంద‌డి చూసిన వారికి అప్పుడే ఆమె ఆ ఇంటి కోడ‌లు అవుతుంద‌ని డిసైడ్ చేశార‌ట‌. రేపో మాపో ఇదే నిజం కాబోతుంద‌ని టాక్‌.. ? ఈ బర్త్ డే ఫోటోల్లో ఆది చుట్టూనే ఈ అమ్మడు హొయలు పోయిందట.

ఆ హీరో, హీరోయిన్ రీల్ ల‌వ్ స్టోరీతో రియ‌ల్ పెళ్లికి రెడీనా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts