హోమ్ క్వారంటైన్ కిట్ ఇంటికే పంపిస్తున్న జగన్!

July 11, 2020 at 12:51 pm

దేశంలో కరోనా పరీక్షలను చాలా వేగంగా అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా చాలా వరకు ఏపీలో కట్టడిలో ఉంది అనుకున్నా సరే కేసులు మాత్రం గత రెండు మూడు రోజుల నుంచి కాస్త వేగంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కరోనా కట్టడిలో భాగంగా ఏపీ సర్కార్ తాజాగా హోం క్వారంటైన్‌లో ట్రీట్‌మెంట్ పొందేవారి కోసం హోమ్ క్వారంటైన్ కిట్‌ని ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఒక కిట్ కేవలం ఒక రోగికి మాత్రమే ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. కరోనా రోగికి అవసరం అయిన వాటిని అన్నింటి ని కూడా సిద్దం చేసి ఉంచారు. కరోనా రోగులు ఇప్పుడు మందుల కోసం గాని సదరు కిట్ కోసం గాని తిరగాల్సిన అవసరం లేదు. కరోనా రోగులు రోడ్ల మీద తిరిగితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది అని భావించిన సిఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

హోం క్వారంటైన్ కిట్‌లో ఉండేవి ఏంటీ అంటే… కరోనాను తగ్గించే టాబ్లెట్లు, చేతికి గ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులు, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు, ఆక్సిజన్ లెవెల్ స్థాయి చెప్పే పల్స్ ఆక్సీమీటర్ ఇందులో ఉంటుంది. వీటిని ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ప్రసంశలు వస్తున్నాయి.

హోమ్ క్వారంటైన్ కిట్ ఇంటికే పంపిస్తున్న జగన్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts