అమ్మో మేము ఆస్పత్రులకు రాలేమ౦టున్న కరోనా రోగులు

July 3, 2020 at 12:52 pm

ఆస్పత్రుల్లో ఇప్పుడు కరోన చికిత్స తీసుకోవాలి అంటే రోగులు భయపడుతున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా రోగులు చాలా ప్రాంతాల్లో తాము ఇంట్లోనే చికిత్స తీసుకుంటామని తాము ఆస్పత్రులకు రాలేము అని చెప్తున్నారు. ఇటీవల హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రికి సంబంధించి ఒక వీడియో లీక్ అయింది. ఇద్దరు రోగులకు సంబందించిన వీడియో లు బయటకు వచ్చాయి.

దీనితో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు ఏం జరుగుతుందో తెలియదు అని తాము ఆస్పత్రులకు రాలేము అని కరోనా పరిక్షలు చేయి౦చుకున్న వారు అంటున్నారు. కొన్ని చోట్ల రోగులు కనపడకుండా పోతున్నారు అనే వార్తలు కూడా వారిని బాగా భయపెడుతున్నాయి. విజయవాడలో ఒక వృద్దుడు కరోనాతో బాధ పడుతూ ఆప్సత్రిలో జాయిన్ అయ్యాడు.

వారం రోజులు గడిచినా సరే ఆచూకి తెలియడం లేదు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు ఆస్పత్రులకు రావాలి అంటే చాలు రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కొంత మంది కరోనా పరీక్షలో పాజిటివ్ రాగానే హోం ఐసోలేషన్ ని వైద్యులను కోరుతున్నారు. ఇక వైద్యులు కూడా కొన్ని ప్రాంతాల్లో హోం ఐసోలేషన్ ని సూచించడం గమనార్హం

అమ్మో మేము ఆస్పత్రులకు రాలేమ౦టున్న కరోనా రోగులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts