షాకింగ్‌ లుక్‌లో దర్శ‌న‌మిచ్చిన బ‌న్నీ.. వైర‌ల్‌గా మారిన ఫోటోలు..!!

July 3, 2020 at 8:54 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకుని.. ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో `పుష్ప‌` సినిమా చేస్తున్నాడు. ఇదివరకే వీరి కాంబోలో ఆర్య, ఆర్య2 వంటి హిట్ చిత్రాలు రావడంతో హ్యాట్రిక్ అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల విడుద‌లైన‌ బన్నీ లుక్‌ కేక పెట్టించింది.

trendy tolly's tweet - "Stylish ⭐ New look with tiny pony Going ...

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో బ‌న్నీ ఇంటికే ప‌రిమితం అయ్యాయి. అయితే క‌రోనా కార‌ణంగా ఇంట్లో ఉంటున్న అల్లు అర్జున్ తాజాగా షాకింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు.

Image

హైదరాబాద్‌లో అల్లు అర్జున్ వాక్‌కి వెళ్లగా.. అక్కడున్న వారు తమ కెమెరాలతో బన్నీని క్లిక్ మనిపించారు. ఈ ఫోటోల్లో ఒత్తు జుట్టు వెనకాల చిన్న పోనీతో బన్నీ క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ ఫోటోలు నెట్టింట్లో తెర వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న ఫ్యాన్స్ బ‌న్నీ లుక్ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

షాకింగ్‌ లుక్‌లో దర్శ‌న‌మిచ్చిన బ‌న్నీ.. వైర‌ల్‌గా మారిన ఫోటోలు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts