ఆసుపత్రి నుంచి బిగ్ బీ వీడియో సందేశం!!

July 12, 2020 at 1:25 pm

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌కు, ఆయ‌న కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అమితాబ్‌నే ట్వీట్ చేసాడు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పాడు అమితాబ్. అయితే అమితాబ్ మాత్రం ముంబై నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే ఏడు పదులు వయసులో అమితాబ్ బచ్చన్ కు ప్రాణాంతక కరోనా సోకడం సినీ ఇండ‌స్ట్రీతో పాటు అభిమానుల‌ను కూడా క‌ల‌వ‌ర పెడుతోంది.

ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ స‌హా టాలీవుడ్‌, కోలీవుడ్ ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల సినీ ప్ర‌ముఖులు బిగ్‌బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ ట్వీట్స్ వేశారు. ఈ నేప‌థ్యంలోనే బిగ్ బీ ఓ వీడియో సందేశం విడుద‌ల చేశారు. “నానావ‌తి హాస్పిట‌ల్‌లోని డాక్ట‌ర్స్‌, న‌ర్సులు, ఇత‌ర హాస్పిట‌ల్ సిబ్బంది గురించి మాట్లాడాల‌నుకుంటున్నాను. చాలా ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో వీరు అద్భుత‌మైన సేవ‌ల‌ను అందిస్తున్నారు. నేను ఈ మ‌ధ్య సూర‌త్‌లోని ఓ బోర్డ్‌ను నా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాను. అందులో ఇప్పుడు దేవుడి గుళ్లు ఎందుకు మూసివేశారో తెలుసా? దేవుడు తెల్ల‌కోటు వేసుకుని హాస్పిట‌ల్లో ప‌నిచేస్తున్నాడని ఉంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌నిచేస్తున్న వైద్య సిబ్బంది, ఇత‌రులు దైవ స్వ‌రూపులు. నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. దేవ‌డు మిమ్మ‌ల్ని చ‌ల్ల‌గా చూస్తాడు మీరు లేక‌పోతే మ‌నుషులంతా ఏమైపోయేవారో. ఇవి నిరాశ జ‌న‌కంగా ఉన్న రోజుల‌ని నాకు తెలుసు. అంద‌రూ వారి ప‌రిధులు దాటి ప‌నిచేస్తున్నారు. మాన‌సిక ఒత్తిడి, భ‌యం నెల‌కుంది. కానీ నేను చెప్పేదొక్క‌టే ఎవ‌రూ భ‌య‌ప‌డొద్దు, నిరాశప‌డొద్దు. మ‌నమందం క‌లిసి పోరాడాల్సిన త‌రుణ‌మిది. అలా చేస్తేనే మ‌నం ఈ ప‌రిస్థితి నుండి బ‌య‌ట‌ప‌డ‌గ‌లం.“ అంటూ బిగ్ బీ వీడియో సందేశం పంపారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

ఆసుపత్రి నుంచి బిగ్ బీ వీడియో సందేశం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts