హాస్ప‌ట‌ల్‌ నుంచి అమితాబ్‌ భావోద్వేగభరిత పోస్ట్!!

July 14, 2020 at 1:48 pm

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశ్వ‌రూపం చూపిస్తోంది. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం దేశ‌దేశాలకు పెద్ద స‌వాల్‌గా మారింది. ఇక ఇటీవ‌ల బాలీవుడ్‌లో బచ్చన్ ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. . మొదటగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. అయితే అమితాబ్, అభిషేక్‌లకు కరోనా రావడంతో మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ రిపోర్ట్స్‌లో ఆయ‌న కోడలు ఐశ్వర్యా రాయ్, మనమరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. మిగిలిన కుటుంబ సభ్యులు.. జయ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా , ఆమె పిల్లలు అగస్త్య , నవ్య నవేలి నివేదికలు మాత్రం నెగటివ్ అని వచ్చాయి. బిగ్ బీ కుటుంబంలో నలుగురికి కరోనా రావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆ హాస్ప‌ట‌ల్‌ నుంచి ఆయన తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు.

త‌న‌పై కొండంత ప్రేమ‌ కురిపిస్తోన్న వారికి న‌మ‌స్క‌రిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రాములో ఓ ఫొటో పోస్ట్ చేశారు. కుండ‌పోత వ‌ర్షంలా అభిమానులు కురిపిస్తున్న ప్రేమ వ‌ర్షం అన్ని క్లిష్టమైన అడ్డుగోడ‌ల‌ని కూడా బద్దలు కొడుతోందని చెప్పారు. అభిమానుల అపార‌మైన ప్రేమ‌లో తాను పూర్తిగా త‌డిసిపోయానని పేర్కొన్నారు. అలాగే తనతో పాటు, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యల కోసం ప్రార్థనలు చేస్తోన్న అభిమానులకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు అమితాబ్‌ పేర్కొన్నారు. తాను ప్రస్తుతం చీక‌టిలో ఉన్నప్పటికీ ప్ర‌కాశిస్తూనే ఉన్నానని చెప్పారు. అందరికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నానని అమితాబ్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు.

హాస్ప‌ట‌ల్‌ నుంచి అమితాబ్‌ భావోద్వేగభరిత పోస్ట్!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts