ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణ‌యం..!!

July 4, 2020 at 8:01 am

క‌రోనా వైర‌స్.. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. వ్యాక్సిన్ లేని క‌రోనాను ప్ర‌స్తుతం మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ రోజురోజుకు రికార్డు స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య‌.. 16934కు చేరింది. అదే స‌మ‌యంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 200 మార్క్ దాటి.. 206కు చేరింది.

అయితే క‌రోనా విజృంభిస్తున్న వేళ‌.. ఈ ప్రాణాంత‌క‌ మ‌హమ్మారిని క‌ట్ట‌డి చేసే దిశ‌గా‌‌ జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధ్వర్యంలో సుమారు 91 క‌రోనా పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడమే కాకుండా 7 ప్రైవేట్ సంస్థల అధ్వర్యంలో పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. తద్వారా క‌రోనా పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచింది.

అలాగే వివిధ ఆసుపత్రులలో పడకల లభ్యతను కూడా పెంచింది. రోజురోజుకు పాజిటివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుంటే, అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం 41,114 పడకల్ని సిద్ధం చేసి అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా.. ప్రభుత్వ సౌకర్యాలతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 91 కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు ఉచితంగా చేయ‌నుంది. ఇక ప్రభుత్వం ఇటీవ‌ల విడుదల చేసిన జీవో నంబర్ 296 ప్రకారం.. ప్రైవేట్ ల్యాబ్స్‌లో కోవిడ్ పరీక్ష కోసం రూ.2900 వసూలు చేయాల్సింది చెప్పింది.

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణ‌యం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts