ఏపీలో వ‌చ్చే నెల నుంచే కాలేజీలు.. కొత్త నిబంధ‌లివే!!

July 12, 2020 at 11:03 am

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌ల్లోలం సృష్టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచంపై దాడి చేసి ఆరు నెల‌లు గ‌డుస్తున్నా.. వ్యాక్సిన్ రాలేదు. ఈ క్ర‌మంలోనే క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక క‌రోనాను అదుపుచేయ‌డానికి లాక్‌డౌన్ విధించ‌డంతో.. అన్నితో పాటు విద్యాసంస్థ‌లు కూడా మూత‌ప‌డ్డాయి. అయితే ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం అవ్వ‌డంతో.. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కాలేజీలను నడిపించాలని ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి కాలేజీలను ప్రారంభించాలని, మొత్తం 196 పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. కాలేజీలు రెండో శనివారం సైతం పని చేయాల్సి ఉంటుంది. పండగ సెలవులు ఒకట్రెండు రోజులు మాత్రమే ఉండనున్నాయి. విద్యార్థులకు యూనిట్ పరీక్షలు ఉండడంతో పాటు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేందుకు వీలుగా వీడియోలను రూపొందించే పనిలో ఉన్నారు.

అలాగే ప్రతి సబ్జెక్టుకూ ఒక వర్క్ బుక్ ను ప్రత్యేకంగా ఇవ్వనున్నామని, జేఈఈ మెయిన్ తదితర ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా ఈ వర్క్ బుక్ ఉంటుందని తెలియజేసింది. ఇక ఎప్పటి మాదిరిగానే మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహించాలని నిర్ణ‌యించారు.

ఏపీలో వ‌చ్చే నెల నుంచే కాలేజీలు.. కొత్త నిబంధ‌లివే!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts