క‌రోనా టెస్టుల్లో ఏపీ జోరు.. 11 లక్షలు దాటిన పరీక్షలు!!

July 11, 2020 at 9:05 am

క‌రోనా వైర‌స్.. గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మందిని బ‌లితీసుకుంది. ఇంకెంత మందిని హ‌రించేస్తుందో అర్థంకాని ప‌రిస్థితి. మ‌రోవైపు ఎన్ని క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నా.. ఈ క‌రోనాకు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే క‌రోనా టెస్టుల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంచి జోరు మీద దూసుకుపోతోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల సంఖ్య 11 లక్షలు దాటింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల్లో ఏపీలో 21,020 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో.. రాష్ట్రంలో మొత్తంగా కరోనా పరీక్షల సంఖ్య 11,15,635కు చేరింది.

ఇక్క‌డో మ‌రోవిష‌యం ఏంటంటే.. ఏపీలో రికవరీ రేటు కూడా అధికంగానే ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో రికవరీ రేటు 51.90శాతం ఉండ‌గా ఇన్ఫెక్షన్‌ రేటు 2.28 శాతంగా, మరణాల రేటు 1.15 శాతంగా ఉంది. కాగా, ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11, 936 కాగా, 13,194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 292కి చేరింది.

క‌రోనా టెస్టుల్లో ఏపీ జోరు.. 11 లక్షలు దాటిన పరీక్షలు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts