ఈఎస్ఐ స్కాం లో మరో మాజీ మంత్రి అరెస్ట్…?

July 10, 2020 at 3:50 pm

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న ఈఎస్ఐ స్కాం కి సంబంధించి నేడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పిఏ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతని వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. మరో మాజీ మంత్రి పిఏ ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.

 

ఇటీవల ఒక కీలక నేత రాష్ట్రం దాటి ఓడిశా వెళ్ళిపోయారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. సదరు మాజీ మంత్రిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అని టాక్. ఇక అచ్చెన్నాయుడు ని ఇప్పటికే అరెస్ట్ చేయాగా ఆయనకు ఏసీబీ కోర్ట్ బెయిల్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి కూడా సిఎం గా ఉన్న సమయ లింక్ ఉంది అంటున్నారు.

 

ఈ కేసులో అవసరం అయితే ఆయనను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నిజమా కాదా అనేది చూడాలి. ఇక టీడీపీ నేతలు మరి కొందరికి కూడా ఇందులో పరోక్ష పాత్ర ఉంది అని అప్పుడు ఆర్ధిక శాఖలో పని చేసిన కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది అనే ప్రచారం జరుగుతుంది.

ఈఎస్ఐ స్కాం లో మరో మాజీ మంత్రి అరెస్ట్…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts