ఏపీ కేబినేట్ నిర్ణయాలు ఇవే

July 15, 2020 at 5:14 pm

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి పెర్ని నానీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన మీడియాకు వివరించారు. మైనింగ్ శాఖ ద్వారా ఈ కార్పొరేషన్ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖలో 9712 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన మీడియాకు తెలిపారు.

ఈ 9712 ఉద్యోగాల్లో 5701 ఉద్యోగాలు ప్రభుత్వం కొత్తగా సృష్టించినవే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందతున్న అర్హులకు సైతం ఈ పథకం వర్తిస్తుందని ఆయన వివరించారు. నాడు-నేడు పథకం ద్వారా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించే కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా రూ. 920 కోట్లు ఖర్చు చేశామన్న ఆయన మరో రూ.250 కోట్లు రెండో విడత కార్యక్రమానికి కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేసామని అన్నారు. ఈ కమిటీలో సీఎస్, సీసీఎల్ఏ, జీఏడీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ కమిటీ కన్వీనర్‌గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారన్నారు.

ఏపీ కేబినేట్ నిర్ణయాలు ఇవే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts