షాకింగ్ న్యూస్‌‌: ఏపీ డిప్యూటీ సీఎంకు క‌రోనా పాజిటివ్‌!!

July 13, 2020 at 8:16 am

క‌రోనా పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. రోజురోజుకు మ‌రింత వేగంగా విస్త‌రిస్తోంది. మ‌రోవైపు క‌రోనా బారిన ప‌డుతున్న ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనా పాజిటివ్ వ‌చ్చింది. కడప జిల్లాలో ఆయన కుటుంబానికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో డిప్యూటీ సీఎంతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది.

దీంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో తిరుపతిలోని కొవిడ్ ఆసుపత్రి లో చేరారు. వీరి ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

షాకింగ్ న్యూస్‌‌: ఏపీ డిప్యూటీ సీఎంకు క‌రోనా పాజిటివ్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts