ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు: టైం టూ టైం అంతే…!

July 1, 2020 at 6:10 pm

ఆంధ్రప్రదేశ్ లో కాస్త గత రెండు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గాయి. రోజు 800 వరకు నమోదు అవుతున్న కరోనా కేసులు ఇప్పుడు కాస్త పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి. అయితే ఈ తరుణంలో తెలంగాణా నుంచి భారీగా ఏపీ వస్తున్నారు జనాలు. ఈ నేపధ్యంలో ఏపీ పోలీసు శాఖ అప్రమత్తం అయింది. తాజాగా డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంక్షలు యధావిధిగా ఉంటాయని అన్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేసారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు.. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌ పొందాలి అని చెప్పారు.

పాస్‌ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని ఈ సందర్భంగా ఆయన సష్టం చేసారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే అనుమతిస్తారని ఆయన అన్నారు. పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు: టైం టూ టైం అంతే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts