ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపుపై కీలక ప్రకటన…!

July 11, 2020 at 5:12 pm

గత వారం పది రోజులుగా సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు ని ఏపీ సర్కార్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని,

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేసారు. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని గాని లేదా పెంచాలనే ప్రతిపాదన ఏదీ కూడా ప్రభుత్వం దగ్గర లేదని ఆయన పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి, ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత తీసుకురావడానికి చేస్తున్న కుట్ర అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.

 

ఇలాంటి దురుద్దేశపూర్వక నిరాధార వార్తల పట్ల ఉద్యోగులు అందరూ జాగ్రత్తగా ఉండాలని మనవి అంటూ ఆయన విజ్ఞప్తి చేసారు. ఉద్యోగులను ఆందోళనకు గురి చేయడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీయాలనే కుట్రపన్నిన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సోమవారం డీజీపీ గౌతం సవాంగ్ ను కలిసి కొరనున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపుపై కీలక ప్రకటన…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts