గంటా అవినీతిపై ప్రభుత్వం ఫోకస్… రంగంలోకి చంద్రబాబు

July 17, 2020 at 10:32 am

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపధ్యంలో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు కూడా ఎవరో ఒకరి అవినీతి మీద ఫోకస్ చేస్తుంది వైసీపీ సర్కార్. అచ్చెన్నాయుడు వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉండగా మరో నేత అవినీతిని బయటకు లాగుతున్నారు.

తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి, విశాఖ జిల్లా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అవినీతికి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఆయన విద్యా శాఖా మంత్రిగా గత ప్రభుత్వంలో ఉన్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ సర్కార్ ప్రవేశ పెట్టిన సైకిల్ల కార్యక్రమంలో ఆయన అవినీతి చేసారు అని గుర్తించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ కూడా చేసారు. ‘బడికొస్తా’ పథకం పేరుతో లక్షా 82 వేల సైకిళ్లు బాలికలకు పంపిణీ చేసారట.

 

ఎందరికి అందాయో,ఇచ్చినట్టు రికార్డుల్లో రాసారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల ‘గంట’లు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉంది. అంటూ ఆయన ట్వీట్ చేసారు. ఇక గంటా ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని మంత్రి అవంతి కూడా అన్నారు. దీనితో ఆయనను కాపాడటానికి చంద్రబాబు రంగంలోకి దిగారు అని ఢిల్లీ ఎంపీలను పంపించారు అని అంటున్నారు.

గంటా అవినీతిపై ప్రభుత్వం ఫోకస్… రంగంలోకి చంద్రబాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts