ఏపీలో ఆగస్ట్ 1 నుంచి పించన్ పెంపు…!

July 10, 2020 at 5:31 pm

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సిఎం జగన్ మాత్రం ఇచ్చిన మాట విషయంలో వెనక్కు తగ్గడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆయన సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాత్రం దూకుడుగానే ఉన్నారు అనేది చెప్పవచ్చు. రాజకీయంగా జగన్ విమర్శలు వస్తున్నా సరే కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో తాను చేసేది చేస్తున్నారు.

ఏపీలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పించన్ ని 2,500 అందిస్తారు. ఇప్పటి వరకు 2 వేల 250 మాత్రమే అందిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే సిఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే పించన్ ని 3 వేలు చేస్తా అని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆయన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జగన్ పించన్ ని 250 ప్రమాణ స్వీకారం సందర్భంగా పెంచారు.

 

ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మరో 250 పెంచుతున్నారు. ఇక నుంచి పించన్ పేదలకు 2500 అందుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పించన్ కొత్త వారికి కూడా అదే విధంగా అందిస్తామని ఎవరికి అయినా పించన్ రాకపోతే దరఖాస్తు చేసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో ఆగస్ట్ 1 నుంచి పించన్ పెంపు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts