క‌రోనా టెస్టుల‌పై చంద్ర‌బాబు యాక్ష‌న్‌.. జ‌గ‌న్ స‌ర్కార్ రియాక్ష‌న్‌..!!

July 6, 2020 at 2:56 pm

గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్.. ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ క‌రోనా స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అత్యధిక పరీక్షలు చేస్తూ రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆంధ్రప్రదేశ్‌లో చేసిన కరోనా పరీక్షల మొత్తం సంఖ్య 10 లక్షలకు చేరింది. అయితే దీనిపై తాజాగా చంద్ర‌బాబు స్పందించారు.

ఏపీలో పది లక్షల కరోనా టెస్టులు చేయ‌డ‌మంతా మాయ‌ని..మొదటి నుంచి జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉందని, కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని విమ‌ర్శించారు. అంతేకాఉద‌, క‌రోనా టెస్టులు చేయించుకోని వారికీ ఎస్సెమ్మెస్ వస్తోందని ఆరోపించారు. అయితే చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల‌కు వెంట‌నే స్పందించిన జ‌గ‌న్ స‌ర్కార్‌.

కరోనా పరీక్ష చేయించుకున్న వ్యక్తి సంబంధిత అధికారులకు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ ఫోన్ నెంబర్ కే ఎస్సెమ్మెస్ వెళ్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఒకవేళ కరోనా టెస్టులు చేయించుకున్న వ్యక్తి తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినా, లేక మరొకరి నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ కే ఎస్సెమ్మెస్ వెళుతుందని వివరించింది. అంతేకాదు, ఒక మిలియన్ సందేశాల్లో ఏవో కొన్ని సందేశాలను తప్పుబట్టడం, అది కూడా ప్రభుత్వం వైపు నుంచి పొరబాటు లేకపోయినా ప్రభుత్వానికి తప్పులు అంటగట్టడం ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో స‌రికాద‌ని సూచింది.

క‌రోనా టెస్టుల‌పై చంద్ర‌బాబు యాక్ష‌న్‌.. జ‌గ‌న్ స‌ర్కార్ రియాక్ష‌న్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts