
విశాఖ జిల్లాలో జరిగిన ఒక ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంపై ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానీ స్పందించారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు. పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న ఆయన… ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఘటనలో ఎవరికి ప్రాణ నష్టం లేకుండా ఉండటానికి గానూ ప్రత్యేక వైద్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే విధంగా ఈ ప్రమాదం కారణంగా ఆ కంపెనీ ప్రాంతాలలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండటానికి గానూ అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇక సిఎం జగన్ కు ప్రమాదం గురించి వివరించారు.
ఆయన నేడు మధ్యాహ్నం సిఎం జగన్ తో తాడేపల్లి లో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్ కు ఆయన ప్రమాద తీవ్రతః గురించి వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ తో సిఎం జగన్ మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించాలి అంటూ ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.