ఏపీలో కరోనా పేరు చెప్తే వణికిపోతున్న మూడు జిల్లాల పోలీసులు!

July 6, 2020 at 1:54 pm

ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. కరోనా దెబ్బకు ఇప్పుడు ఎపీతో పాటుగా క్రమంగా పోలీసులు కూడా భయపడుతూనే ఉన్నారు. ఏ విధంగా కరోనా కట్టడి చెయ్యాలో అర్ధం కాక పాపం పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అదే విధంగా విశాఖ పోలీసులను కరోనా భయపెడుతుంది.

ట్రాఫిక్ సిబ్బంది విధులకు హాజరు కావాలి అంటే చాలు ఇప్పుడు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఏలూరు లో 8 మంది ట్రాఫిక్ సిబ్బంది కరోనా బారిన పడగా దాదాపు 40 మంది వరకు క్వారంటైన్ లో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా భయంతో అల్లాడుతున్నారు. విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ లో కూడా కరోనా కేసులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడి కావడం లేదు అక్కడ కూడా.

ప్రకాశం జిల్లాలో పోలీసులలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఎస్సై లు సిఐ లు అలాగే పలువురు కానిస్టేబుల్స్ కరోనా బారిన పడ్డారు. ఇలా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల్లో కరోనా కేసులు వేగంగా పెరగడం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కూడా కలవరపెట్టే అంశం.

ఏపీలో కరోనా పేరు చెప్తే వణికిపోతున్న మూడు జిల్లాల పోలీసులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts