మధ్యప్రదేశ్ లో వికాస్ దూబే అరెస్ట్

July 9, 2020 at 10:12 am

వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లో ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో 8 మంది పోలీసులను అతను పక్కా ప్లాన్ తో కాల్చి చంపాడు. ఇక అక్కడి నుంచి వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు.

 

హర్యానా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ సహా దాదాపు ఆరు రాష్ట్రాల్లో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అతని అనుచరులు ముగ్గురిని పోలీసులు కాల్చి చంపారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అతని తలపై 5 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. హర్యానాలో అతని అనుచరులు దొరికడంతో అతను చాలా వరకు హర్యానాలోనే ఉండవచ్చు అని భావించారు పోలీసులు.

 

కానీ ఇప్పటి వరకు అతను ఎక్కడ ఉన్నాడు అనేది పక్కా సమాచారం రాలేదు. అయితే అతను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లో ఉన్నాడు అని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో తనిని పక్కా వ్యూహంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మీద ఇప్పటి వరకు 60 కేసులు ఉన్నాయి

మధ్యప్రదేశ్ లో వికాస్ దూబే అరెస్ట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts