కరోనా వ్యాక్సిన్ సాధ్యమా…?

July 3, 2020 at 9:59 am

అసలు కరోనా వైరస్ కి వ్యాక్సిన్ తయారు చేయడం ఈజీనా…? అంటే కష్టం అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ గాని ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రవేత్తలు గాని అసలు దాన్ని అర్ధం చేసుకోవడం లేదు అని అంటున్నారు. అది వారికి అర్ధం కావడం లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గాని అమెరికా ఆరోగ్య శాఖ గాని, మన దేశ ఐసిఎంఆర్ గాని కరోనా ను అర్ధం చేసుకోలేకపోయాయి.

 

అది రోజుకో రకంగా ఉంటుంది అంటూ రోజుకో ప్రకటన చేస్తున్నారు. కోటి మందికి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సోకినా సరే ఇప్పటి వరకు అది ఏంటీ అనేది అర్ధం కావడ౦ లేదు అంటే దాని తీవ్రత గాని దాని వ్యాప్తి గాని ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఫేజ్‌ 1 లో అతి కొద్ది మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు. సురక్షితమా కాదా? రోగ నిరోధక వ్యవస్థను పరిశీలిస్తారు. ఆ తర్వాత అది ఫేజ్ 2 కి వెళ్తుంది.

 

ఫేజ్‌ 2 లో వందల మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షి౦చగా… పిల్లలు, వృద్ధులపై ఎలా ఉంటుంది? తదితర విషయాలను వైద్యులు పరిశీలిస్తారు. ఫేజ్ 3 లో వేలాది మందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తారు. ఏ తరహా జన్యుసమూహాలపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతోందని తెలుసుకుంటారు. అదే విధంగా వ్యాక్సిన్‌ ఎంత సమర్థం అనే దాని మీద కూడా ఒక అంచనాకు వస్తారు. ఇవి అన్నీ జరగాలి అంటే ముందు కరోనా అర్ధం కావాలి. అందుకే ఇప్పటి వరకు చేసిన ట్రయల్స్ ఫెయిల్ అయ్యాయి అంటున్నారు.

కరోనా వ్యాక్సిన్ సాధ్యమా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts