జగన్ పదేళ్ళ ముందే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు: మంత్రి అవంతి

July 14, 2020 at 6:05 pm

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పరవాడ సాల్వేషన్‌ కంపెనీలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని అయన సూచించారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పరిశ్రమలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. కరోనా కారణంగా పర్యాటక శాఖకు నెలకు రూ.10 కోట్లు చొప్పున రూ.60 కోట్ల నష్టం వచ్చిందని ఆయన వివరించారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌ షిప్‌తో 7 పర్యాటక ప్రాంతాల్లో పైవ్ స్టార్ హోటల్స్‌ ప్రారంభిస్తామన్నారు.

 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్న ఆయాన… చంద్రబాబు కొన్ని వర్గాలను మాత్రమే చూసి మేలు‌ చేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. వివక్ష, అవినీతి లేకుండా సంక్షేమ పాలన చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఏర్పాటు ఉద్యమాలు రాకూదని సీఎం జగన్‌ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని చెప్పారు.

జగన్ పదేళ్ళ ముందే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు: మంత్రి అవంతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts