ప్రజల మీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు: అవంతి

July 7, 2020 at 5:45 pm

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ విపక్ష తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. సిఎం వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని భావిస్తుంటే… టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ పని చేసినా అడ్డుకుంటున్నారని ఓడించినందుకు ప్రజల మీద కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

ఇళ్ల పట్టాలు అడ్డుకోవడమే, చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. విశాఖ నగరంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను, గెలిపిస్తే, రెండు లక్షల మందికి ఇల్లు ఇవ్వకుండా కోర్టు కేసులు వేయించి అడ్డుకున్నారని విమర్శలు చేసారు. లబ్ధిదారుల్లో పేద టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇళ్ల పట్టాలలో అవినీతి జరిగితే నిరూపించాలని ఈ సందర్భంగా ఆయన విపక్షానికి సవాల్ చేసారు.

 

మీరు కట్టిన ఇళ్లు కూడా ఇస్తున్నామని… ఎక్కడ ఆపలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్ట౦ చేసారు. రేపు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు, ఎటువంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా కేవలం సేవ కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్ట౦ చేసారు. ఎల్జీ పాలిమర్స్  లాంటి ప్రమాదకర కంపెనీల విషయంలో ఏ మాత్రం రాజీ లేదు అని ఆయన స్పష్టం చేసారు.

ప్రజల మీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు: అవంతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts