బాలయ్య చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమిటి?

July 1, 2020 at 9:50 am

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో బాలయ్య ఈసారి అదిరిపోయే హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే బాలయ్య మరో గుడ్ న్యూస్‌ను తన అభిమానులకు చెప్పేందుకు రెడీ అవుతున్నాడట. ఎప్పట్నుండో తనకు ఎంతో ఇష్టమైన సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తానంటూ చెప్పుకొస్తున్న బాలయ్య, ఇప్పుడు ఆ సీక్వెల్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ను ఎప్పటికైనా తెరకెక్కిస్తానని చెప్పిన బాలయ్య, ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.

సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ‘ఆదిత్య 369’ అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ఆయనే డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో మరోసారి బాలయ్య తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడని, త్వరలోనే తన అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

బాలయ్య చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమిటి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts