క‌రోనా సోకిన వారు ఇలా చేస్తే ఆసుపత్రుల్లో చేరి లక్షలు కట్ట‌క్క‌ర్లేదు: బ‌ండ్ల‌

July 10, 2020 at 8:54 am

ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి క‌రోనా ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. కరోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల, సెల‌బ్రెటీలు, టీవీ ఆర్టిస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కమెడియన్, నిర్మాత అయిన బండ్ల గణేష్‌కు ఇటీవల కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే బండ్ల గణేష్ ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయన ఓ వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించాడు. ఈ క్ర‌మంలోనే కరోనాను తరిమేసేందుకు ఎటువంటి చికిత్స తీసుకున్నదీ వివరించారు. నిత్యమూ కోడిగుడ్డు, శొంఠి, అల్లం, వెల్లుల్లి ఆహారంలో తప్పనిసరని, వేడి నీళ్లు మాత్రమే తాగాలని సలహా ఇచ్చారు.

ఇక తాను నిత్యమూ 7 కోడిగుడ్లను తినేవాడినని, ప్రతి రోజూ శొంఠి రసం తాగేవాడిన‌ని చెప్పారు. ఈ మెనూతో తనకు రెండు వారాల్లోపే నెగటివ్ వచ్చేసిందని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు. ఇక కరోనాకు ఎటువంటి ట్రీట్ మెంట్ మెంటూ అవసరం లేదని, తీసుకునే డైట్ లో జాగ్రత్తలు పాటిస్తే చాలని వెల్లడించారు. మ‌రియు పైన చెప్పిన వీటిని ఆహారంలో చేర్చుకుంటే, ఆసుపత్రుల్లో చేరి లక్షలు కట్టాల్సిన అవసరం కూడా ఉండబోదని బండ్ల పేర్కొన్నాడు.

క‌రోనా సోకిన వారు ఇలా చేస్తే ఆసుపత్రుల్లో చేరి లక్షలు కట్ట‌క్క‌ర్లేదు: బ‌ండ్ల‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts