మాస్కులు పెట్టుకోలేదని.. కోటి వ‌సూల్ చేసిన బెంగళూరు పోలీసులు!!

July 14, 2020 at 2:26 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లో క‌రోనా అడ్డు అదుపు లేకుండా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కాటేస్తోంది. ఇక ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మరణాన్ని ఆహ్వానించినట్టే. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడిచారు. మ‌రెంద‌రో క‌రోనా బారిన‌ప‌డి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

భారత్‌లో కూడా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే.. వ్యక్తిగత శుభ్రత పాటించక తప్పదు. మ‌రియు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటే నోటికి మాస్క్ తప్పనిసరి అయిపోయింది. అయితే కొందరు మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. మాస్కులు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు ఎన్ని క‌ఠన చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఏ మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇక మాస్క్ లేకుండా బయటకు వచ్చే వారిపై జరిమానాలను కూడా విధిస్తున్నారు. అయితే ఈ క్రమంలో మాస్క్ లేని వారిపై బెంగళూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. కోటి జరిమానా విధించారు. జూన్ 9 నుంచి జులై 10 వరకు మొత్తం రూ. 1.01 కోట్లను వసూలు చేశారు. ఇక వీటిలో 46,959 కేసులు మాస్కులు ధరించనందుకు… 3,747 కేసులను సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు విధించారు.

మాస్కులు పెట్టుకోలేదని.. కోటి వ‌సూల్ చేసిన బెంగళూరు పోలీసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts