బిగ్‌బాస్ ఫేమ్ ర‌వికృష్ణ‌కు క‌రోనా.. టీవీ పరిశ్రమలో తీవ్ర ఆందోళ‌న‌..!!

July 4, 2020 at 10:11 am

క‌రోనా వైర‌స్‌.. గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించింది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. దీంతో క‌రోనా అంటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం.. ప్ర‌భుత్వాల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో వీర‌విహారం చేస్తోన్న క‌రోనావైర‌స్ తాజాగా బుల్లితెర‌పై త‌న ప్ర‌తాపం చూపుతుంది.

దీంతో టీవీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. ఇప్ప‌టికే ప‌లువురు స్మాల్ స్క్రీన్ యాక్ట‌ర్స్ క‌రోనా బారినప‌డ‌గా..తాజాగా మ‌రో న‌టుడు బిగ్‌బాస్ ఫేమ్ ర‌వికృష్ణ‌కు క‌రోనా సోకిందని తెలుస్తోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రవి కృష్ణ వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా వచ్చిందని నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు రవి కృష్ణ‌ను క్వారెంటైన్‌కు పంపించివేశారు.

కాగా, బిగ్‌బాస్ షోకు రాక‌ముందు ఎన్నో అనేక సీరియల్స్ లో నటించి ర‌వి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం కూడా ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్నాయి. అయితే ఈయ‌న‌కు క‌రోనా సోక‌డంతో.. గత కొన్ని రోజులుగా ఈయ‌న‌కు దగ్గరగా తిరుగుతున్న వారందరూ తీవ్ర అందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు.

బిగ్‌బాస్ ఫేమ్ ర‌వికృష్ణ‌కు క‌రోనా.. టీవీ పరిశ్రమలో తీవ్ర ఆందోళ‌న‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts