`సాక్షి`లో స‌త్తా చూపిస్తానంటున్న బిత్తిరి సత్తి!!

July 16, 2020 at 8:25 am

చేవెళ్ళ రవి అంటే గుర్తుప‌ట్ట‌రేమో కాని.. బిత్తిరి సత్తి అంటే ట‌క్కున గుర్తుప‌డ‌తారు. హావభావాలతో, డ్రస్సింగ్ స్టైల్‌తో, బిహేవియర్‌తో సత్తి అందరికి సుపరిచితుడే. వి6 న్యూస్ ఛానల్‌లో ప్రసారం అయ్యే తీన్మార్ వార్తలు కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన బిత్తిరి సత్తి.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే వీ6 నుంచి టీవీ 9కి వచ్చిన బిత్తిరి సత్తి.. కొన్ని వ్యక్తిగత కారణాలు, యాజమాన్యంతో పొసగక పోవడం వల్ల అక్కడ నుంచి ఈ మధ్యనే బయటకు వచ్చేశారు. టీవీ9 నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చిన స‌త్తి.. ఇప్పుడు సాక్షి టీవీలో కనిపించనున్నాడు. ఈ మేరకు ఆ టీవీ చానల్‌ యాజమాన్యంతో కూడా సత్తి మాటలు జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో కూడా సెటైరికల్ కామెడీ షోను చేయబోతున్నాడు.

సాక్షి టీవీలో తాను పని చేయబోతున్నట్టు ఓ ప్రోమో ద్వారా సత్తి తెలిపాడు. రావాల్సిన చోటుకే వచ్చానని… ఇకపై సత్తా చూపిస్తానని సత్తి చెప్పడం ప్రోమోలో ఉంది. కాగా, వీ6లో తీన్మార్ వార్తలు అయినా.. టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్ అయినా బిత్తిరి సత్తి ఉంటే టాప్ రేటింగ్ కొల్లగొట్టాయి. ఇప్పుడు సాక్షికి వచ్చి అదే రిపీట్ చేస్తాడనే ఉద్దేశంతో అతనితో పాటు అతని టీంని కూడా సాక్షిలోకి ఆహ్వానించారట. మ‌రి సాక్షిలో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి.

`సాక్షి`లో స‌త్తా చూపిస్తానంటున్న బిత్తిరి సత్తి!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts