ఏపీలో న్యూస్ ఛానల్ కు బీజేపి రెడీ

July 7, 2020 at 3:51 pm

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలపడటం ఏమో గాని ఆ పార్టీ నుంచి వచ్చే వార్తలు మాత్రం ఇప్పుడు కాస్త చర్చకు దారి తీస్తూ ఉంటాయి. ఆ పార్టీ నుంచి ఏ ప్రకటన వచ్చినా జనాలు మాత్రం కాస్త వింతగా చూస్తూ ఉంటారు. సిఎం జగన్ మా మద్దతు లేకపోతే సిఎం అయ్యే వారు కాదు అంటూ చేసే వ్యాఖ్యలు కాస్త వింతగా ఉంటాయి బిజెపి నేతల నోటి నుంచి. ఇక ఇప్పుడు వాళ్ళు ఏపీ మీద కాస్త ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

 

ఏపీలో కేంద్ర మంత్రులను పంపిస్తున్న బిజెపి… తాజాగా ఒక వార్తా ఛానల్ ని లాంచ్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన ఒక జర్నలిస్ట్ ని అడిగారు అని ఆయన కూడా అందుకు ఓకే చెప్పారు అని సమాచారం. త్వరలోనే ఛానల్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని లాంచ్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

 

ఛానల్ కి సంబంధించి అన్ని విధాలుగా కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అని విజయవాడ కేంద్రంగా లేదా విశాఖ కేంద్రంగా స్థాపించే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం జరుగుతుంది. మరి నిజం ఎంత అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దేశ వ్యాప్తంగా కూడా బిజెపి బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఇదే విధంగా దూకుడుగా ఉంది.

ఏపీలో న్యూస్ ఛానల్ కు బీజేపి రెడీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts