బాలీవుడ్‌లో వ‌రుస‌‌ విషాదాలు.. మరో సినీ నటి మృతి

July 13, 2020 at 9:05 am

బాలీవుడ్‌లో వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. కేవ‌లం మూడు నెలల వ్యవధిలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు మరణించారు. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్ ఇలా వ‌రుస మ‌ర‌ణాలు చోటుచోసుకుంటున్నాయి. ఇక మొన్న‌టికి మొన్న ప్రముఖ నటుడు రంజన్‌ సెహగల్ కూడా ఈ లోకాన్ని విడిచారు. ఇక తాజాగా బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటుచేసుకుంది.

యాక్టర్, మోడల్, సింగర్ దివ్యా చౌక్సే ఈ రోజు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. మోడల్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్ అవకాశాలను దక్కించుకున్న దివ్యా చౌక్సే, క్యాన్సర్ వ్యాధి సోకి, సుదీర్ఘకాలం చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్ కోసం మరణానికి కొన్ని గంటల ముందు ఆమె పెట్టిన ఓ హృదయ విదారక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

`క్యాన్సర్ వ్యాధి కారణంగా నేను నెలల తరబడి మరణ మంచంపై ఉన్నాను. బాధ లేని మరొక జీవితంలో కలుద్దాం. ఇక బై… దివ్యా చౌక్సే` అని పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆమె ఈ లోకాన్ని వీడారు. దివ్య చౌక్సే మృతిని ఆమె బంధువు సౌమ్యా అమిష్‌వర్మ తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. దివ్య చౌక్సే కన్నుమూశారని తెలియడం బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

బాలీవుడ్‌లో వ‌రుస‌‌ విషాదాలు.. మరో సినీ నటి మృతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts