చిత్తూరు జిల్లాలో దారుణం.. పబ్‌జీ గేమ్‌కు బలైపోయిన మ‌రో బాలుడు!!

July 13, 2020 at 1:36 pm

పబ్‌జీ గేమ్.. ఐర్‌లాండ్‌కు చెందిన బ్రెద‌ర్ గ్రీన్ అనే వ్య‌క్తి రూపొందించిన ఆ యాప్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్ప‌ర్చుకుంది. అదే స‌మ‌యంలో ఎంతోమంది పిల్లలు, యువకుల ప్రాణాలు కోల్పోడానికి కూడా ఈ గేమింగ్ యాప్ కారణమవుతోంది. పబ్జి గేమ్‌ ఆడుతూ దానికి బానిసలుగా మారిపోతున్నారు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు పిచ్చోళ్లు అవుతుంటే.. మ‌రికొంద‌రు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక తాజాగా ప‌బ్‌జీ గేమ్ మ‌రో బాలుడిని బ‌లితీసుకుంది. పదేపదే పబ్‌జీ ఆడుతోన్న చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన శ్యామ్ ప్రసాద్ (14) అనే బాలుడిని అతడి తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు శ్యామ్‌ ఉరి వేసుకున్నాడు.

కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించే సరికి అతడు ఫ్యాన్‌కు వెళాడుతూ కనిపించాడు..వెంటనే అతన్ని కిందకు దింపి పలమనేరు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం తిరుపతికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో దారుణం.. పబ్‌జీ గేమ్‌కు బలైపోయిన మ‌రో బాలుడు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts