బ్రేకింగ్: 9 లక్షలు దాటిన కరోనా కేసులు!

July 14, 2020 at 9:56 am

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. ప్రతీ రోజు కరోనా కేసులు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. కరోనా తీవ్రత దెబ్బకు ఇప్పుడు దేశంలో దాదాపు కీలక నగరాలు అన్నీ కూడా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయాయి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి భారీగా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగాయి.

 

కరోనా కేసులు దేశ వ్యాప్తంగా 9 లక్షలు దాటాయి. మూడు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. గత 24 గంటల్లో 28,498 కొత్త కేసులు & 553 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం కరోనా కేసులు దేశ వ్యాప్తంగా 9,06,752 వద్ద ఉన్నాయని కేంద్రం పేర్కొంది.

 

వీటిలో 3,11,565 క్రియాశీల కేసులు, 5,71,460 మంది కోలుకున్నారు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. 23,727 మంది కరోనా కారణంగా మరణించారు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దక్షినాది రాష్ట్రాల్లో కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.

బ్రేకింగ్: 9 లక్షలు దాటిన కరోనా కేసులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts