బ్రేకింగ్: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

July 14, 2020 at 10:15 am

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలను కరోనా బాగా ఇబ్బంది పెడుతుంది. కరోనా వైరస్ కేసులు వారిలో ఎక్కువగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఇబ్బంది పడుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా రావడంపై ఇప్పుడు ఎమ్మెల్యేలు కొందరు స్వచ్చందంగా కరోనా పరిక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మరొకరికి కరోనా సోకింది అని అధికారులు వెల్లడించారు.

నెల్లూరు జిల్లా వైసీపీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీనితో ఆయనకు కరోనా పరిక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నా సరే ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీనితో అధికారులు అప్రమత్తం అయి ఆయనకు పరిక్షలు నిర్వహించారు. ఆయనకు కరోనా రావడంతో వెంటనే స్థానికంగా ఉన్న చెన్నై అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు ఇప్పుడు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యే గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది అని తెలుస్తుంది. అయన కుటుంబ సభ్యులు అందరికి కరోనా పరిక్షలు చేసారు అధికారులు. అందరికి నెగటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.

బ్రేకింగ్: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts