బ్రేకింగ్: ఏపీ మీద విరుచుకుపడిన కరోనా వైరస్…!

July 15, 2020 at 4:04 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఏ మాత్రం కూడా ఆగడం లేదు. వేల కేసులు పదుల్లో మరణాలు రాష్ట్ర ప్రజలను భయపెడుతున్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతూ ప్రజలను భయపెడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో నమోదు అయిన కేసులు చూస్తే కచ్చితంగా భయపడటం ఖాయం. 2432 మందికి గత 24 గంటల్లో ఏపీలో కరోనా పాజిటివ్ గా తెలిసింది.

ఇక మరణాలు కూడా రికార్డ్ స్థాయిలో ఏకంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 468 కరోనా కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 4౦3 కరోనా కేసులు వచ్చాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 257 మందికి కరోనా రాగా తూర్పు గోదావరి జిల్లాలో 247 మందికి కరోనా సోకింది. మరణాలు కూడా ఏపీలో భారీగా నమోదు కావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35 వేల 45 1 గా ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి రాష్ట్రంలో 452 మంది మరణించారు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక గత 24 గంటల్లో 22 వేల 197 మందికి కరోనా పరిక్షలు చేసారు. ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల 17 వేల 963 మందికి కరోనా పరిక్షలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

బ్రేకింగ్: ఏపీ మీద విరుచుకుపడిన కరోనా వైరస్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts