దేశంలో మళ్ళీ కరోనా ఉగ్ర రూపం, రికార్డ్ కేసులు, రికార్డ్ మరణాలు…!

July 9, 2020 at 10:23 am

దేశంలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా ఉన్నా సరే కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా రెండు మూడు రోజులు కాస్త తగ్గినా సరే అనూహ్యంగా మరోసారి భారీగా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా అల్లాడిపోతున్నాయి. కరోనా వైరస్ నుంచి బయటపడ్డాం అని భావించిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు కరోనాతో అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది.

 

గత 24 గంటల్లో అత్యధికంగా 24879 కొత్త కరోనా కేసులు మరియు 487 మరణాలు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు 7 లక్షల 67 వేల 296 గా ఉన్నాయి. వీటిలో 269789 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నుంచి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 476378 మంది కోలుకుని బయటపడ్డారు.

 

దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 21129 మంది మరణించారు అని కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా పరిక్షలు కోటి 8 లక్షలకు చేరువలో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 2 లక్షల 67 వేల పరిక్షలు చేసారు.

దేశంలో మళ్ళీ కరోనా ఉగ్ర రూపం, రికార్డ్ కేసులు, రికార్డ్ మరణాలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts