టీటీడీ ఉద్యోగుల్లో కరోనా కేసులు…

July 7, 2020 at 4:05 pm

తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రతీ రోజు కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తిరుపతిలో కరోనా తీవ్రత నేపధ్యంలో తిరుమలలో కరోనా కేసులు కట్టడి చేయడానికి గానూ అధికారులు మార్చ్ 20 నుంచి అక్కడ పూర్తిగా దర్శనం నిలిపివేశారు. ఇప్పుడు అక్కడ దర్శనాలను తిరిగి ప్రారంభించింది టీటీడీ.

ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో 17 మందికి పాజిటీవ్ వచ్చింది. వారు ఎవరికి కూడా భక్తుల నుంచి రాలేదు అని స్పష్టం చేసారు అధికారులు. భక్తులకు తాము ర్యాండం పరిక్షలు చేస్తున్నామని వారిలో ఎవరికి కరోనా ఉందని నిర్ధారణ కాలేదు అని స్పష్టం చేసారు. అయితే ,తిరుపతి లో కేసులు కారణంగానే తిరుమల లో కరోనా కేసులు పెరుగుతున్నాయి అని పేర్కొన్నారు.

 

దీనిపై మాట్లాడిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతిలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా వారు వైరస్ బారిన పడినట్లు గుర్తించామని అన్నారు. ఉద్యోగులకు పూర్తి సంరక్షణ కల్పిచేందుకు జాగ్రత్తలు తీసుకుంటామని ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసారు.

టీటీడీ ఉద్యోగుల్లో కరోనా కేసులు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts