తెరాస ఎమ్మెల్యే ఫ్యామిలీని షేక్ చేస్తున్న కరోనా ..!

July 20, 2020 at 12:40 pm

తెలంగాణాలో తెరాస ఎమ్మెల్యేలు ఇప్పుడు కరోనా పేరు చెప్తే చాలు భయపడే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంటికే పరిమితం అయినా సరే కరోనా మాత్రం వారిని వదిలే అవకాశాలు కనపడటం లేదు. కరోనా మహమ్మారి దెబ్బకు సిఎం కేసీఆర్ కూడా ఇటీవల ప్రగతి భవన్ ని కాళీ చేసి వెళ్ళారు. అందులో పని చేసే 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

 

ఇక ఇప్పుడు కరోనా ఒక ఎమ్మెల్యేకి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. కరోనా దెబ్బకు ఎమ్మెల్యే ఫ్యామిలీ మొత్తం కూడా షేక్ అవుతుంది. ఆయనకు గత నెలలో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన భార్య, వంట మనిషి డ్రైవర్ కి కరోనా సోకింది. వారు అందరూ కరోనా నుంచి కోలుకుని బయపడ్డారు. ఇప్పుడు ఆయన కుమారుడు, కోడలికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు.

 

ఈ నెల 18 న ఆయనకు కరోనా సోకినట్లు వెల్లడి అయింది. ఇక వారితో పాటుగా వ్యక్తిగత సిబ్బంది, ఎమ్మెల్యే కొడుకు ఆఫీస్ లో పని చేసే ఒక ఇద్దరికీ కరోనా సోకింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక ఎమ్మెల్యే కుటుంబం మొత్తాన్ని కూడా క్వారంటైన్ లో ఉంచి, వారి వద్దకు కూడా ఎవరిని రానీయడం లేదు అధికారులు. వారి కుటుంబ పరిస్థితిపై సిఎం కేసీఆర్ కూడా ఆరా తీసారు.

తెరాస ఎమ్మెల్యే ఫ్యామిలీని షేక్ చేస్తున్న కరోనా ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts