ఏపీఎస్ ఆర్టీసిని షేక్ చేస్తున్న కరోనా

July 13, 2020 at 7:44 pm

ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి ఎంత సమర్ధంగా పని చేస్తున్నా సరే కేసులు రాష్ట్రంలో ఆగడం లేదు. ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా కరోనా పరిక్షలు చేస్తున్నా సరే కేసులు మాత్రం ప్రతీ రోజు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో.. ఏపీ ప్రభుత్వానికి మరో తల నొప్పి మొదలయింది. దాదాపు మూడు నెలల పాటు గ్యాప్ తీసుకుని బస్ సర్వీసులను మొదలు పెట్టారు.

ఇప్పుడు ఆ బస్ సర్వీసుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్టీసి లో ఏకంగా 140 మంది ఉద్యోగులకు కరోనా సోకడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షాక్ అయింది. అంత మందికి ఒక్కసారే కరోనా రావడంతో ఇప్పుడు ఏపీలో బస్ సర్వీసులపై పునరాలోచనలో పడింది జగన్ సర్కార్. కరోనా కేసులు ఇప్పుడు ప్రయాణికుల్లో కూడా నమోదు కావడంతో జగన్ సర్కార్ కు తలనొప్పిగా మారింది.

 

దీనితో ఏపీలో ఇప్పుడు బస్ సర్వీసులను నిలిపివేసే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నారు అని పరిశీలకులు అంటున్నారు. కేసులు ఇంకా పెరిగితే ఇబ్బంది అని భావించి కేసులు ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు కరోనా కట్టడికి గానూ బస్ సర్వీసులను ఆపెయడమే మంచిది అని భావిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు బస్ సర్వీసులు ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది.

ఏపీఎస్ ఆర్టీసిని షేక్ చేస్తున్న కరోనా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts