కేంద్రం గవర్నర్ ను దింపిందా…?

July 7, 2020 at 2:47 pm
a

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. హైదరాబాద్ లో కరోనా కట్టడి చర్యల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఫలితం మాత్రం పెద్దగా కనపడటం లేదు అనే చెప్పాలి.

ఇది పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణా గవర్నర్ గా ఉన్న తమిళసై సౌందర్య రాజన్ తెలంగాణాలో కరోన కేసుల పెరుగుదల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణాలో కరోనా కేసుల కట్టడికి సంబంధించి ఆమె ప్రభుత్వ అధికారుల నుంచే నేరుగా సమాచారం తెప్పించుకునే ఆలోచనలో ఉన్నారు అనే కథనాలు వస్తున్నాయి. తెలంగాణాలో కరోనా కేసులు పరీక్షలను ఆమె సిఎస్ ని అడగాలి అని చూసారు.

 

అయితే అధికారులు మాత్రం ఆమె సమావేశానికి వెళ్ళలేదు. నిన్న గవర్నర్ పిలిచినా సరే సిఎస్ సోమేశ్ కుమార్ ఖాళీ లేదు అని వెళ్లకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె నుంచి కేంద్రం నివేదికలు అడిగింది అని అందుకే ఆమె ఈ విధంగా వ్యవహరించారు అని సమాచారం. అందుకే ఆమె నేరుగా ఇటీవల్ కరోనా ఆస్పత్రులను కూడా సందర్శించారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రం గవర్నర్ ను దింపిందా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts