జనాభా పెరుగుదలపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

July 11, 2020 at 5:20 pm

భారత్ లో జనాభా నియంత్రణ అనేది దాదాపుగా ఒక కల అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ భారత దేశంలో కాస్త జనాభా కట్టడిలోనే ఉన్నా సరే ఉత్తర భారతదేశంలో మాత్రం జనాభాను కట్టడి చేయడం అనేది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు కరోనా వ్యాప్తికి కూడా ప్రధాన కారణం దాదాపుగా అదే అనే వ్యాఖ్యలు మనం వింటున్నాం. స్వయంగా కేంద్రమే ఆ తరహా వ్యాఖ్యలు చేసింది.

తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలవాలంటే దేశంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జనాభా నియంత్రణ అనేది ఓ ఛాలెంజ్ అన్నారు ఆయన. దీనికి కఠిన చట్టాలు రావాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

 

జనాభా గనుక పెరుగుతుంటే ఏ దేశం కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదు అని ఆయన అన్నారు. ఏ మతం వారైనా సరే… దానిని నిక్కచ్చిగా, కఠినంగా అమలు చేసేలా ఉండాలని ఆయన వ్యాఖ్యలు చేసారు. 1979 లో చైనా గనుక నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే మాత్రం… మరో 60 కోట్ల జనాభాతో చైనా నిండిపోయేదని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు దాని మీదనే ఉంటుందని అన్నారు.

జనాభా పెరుగుదలపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts