కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసే అవకాశం..?

July 3, 2020 at 6:27 pm

వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసుకి సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఆయనను అరెస్ట్ చేయడానికి గానూ ఇప్పటికే సిద్దం అయ్యారు అని తెలుస్తుంది. ఆయనను విచారించే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. దీనిపై రాబోయే రెండు మూడు రోజుల్లో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారు అని ముందు నివేదికను హోం శాఖా మంత్రికి ఇచ్చి ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే ఆయనపై కేసు కూడా నమోదు చేసారు బందరు పోలీసులు. ఆయనతో పాటుగా మరో టీడీపీ నేతపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్డమయ్యారు. ఈ పరిణామం తో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

అయితే దీనిని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనను అరెస్ట్ చేయడం బీసీ నాయకత్వాన్ని లేకుండా చేయడమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ కూడా చేసారు. అలాగే కొందరు మాజీ మంత్రులు కూడా దీనిపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేడు కొల్లు రవీంద్ర ఇంటికి భారీగా పోలీసులు కూడా వెళ్ళారు.

కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసే అవకాశం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts