చంద్రబాబు పది కోట్లు ఇచ్చినా వద్దంటున్న టీడీపీ ఎమ్మెల్యే

July 2, 2020 at 5:01 pm

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని ఎప్పుడు ఎవరు వీడే అవకాశం ఉంది అనే దానిపై ప్రతీ రోజు కూడా ఏదోక చర్చ జరుగుతూనే ఉంది. ఆ పార్టీలో బలమైన నేతలుగా ఉన్న వారు పార్టీ మారే అవకాశం ఉంది అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కరోనా కేసుల దెబ్బకు ఇప్పుడు ఎవరూ కూడా ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు రావడం లేదు గాని… లోపల చెయ్యాల్సింది అంతా చేస్తున్నారు.

 

తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారడానికి అంతా సిద్దం చేసుకుని రెడీ అయ్యారు అనే ప్రచారం జరుగుతుంది. ప్రకాశం జిల్లాకు చెందిన సదరు ఎంపీ గారికి మంచి పేరు ఉంది. ఆయనకు క్షేత్ర స్థాయిలో మంచి బలం కూడా ఉంది. ఆయన పార్టీ మారితే టీడీపీ కి కాస్త ఇబ్బందే. జిల్లాలో ఆయన మినహా బలమైన నేతలు ఎవరూ లేరు. ఇటీవల ఆయనకు చంద్రబాబు పది కోట్లు సర్దారు.

 

అయినా సరే ఎంపీ గారు మాత్రం పార్టీలో ఉండటానికి గానూ అంతగా ఆసక్తి మాత్రం చూపించడం లేదు. పదేళ్ళు పార్టీ అధికారంలో లేకపోయినా సరే తాను అన్ని విధాలుగా అండగా ఉంటాను అని చంద్రబాబు చెప్పినా సరే ఎమ్మెల్యే గారు మాత్రం మారడానికే రెడీ గా ఉన్నారు అని ఆయన ఏ క్షణం అయినా సరే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అని మంత్రి బాలినేని తో ఆయన కలిసారు అని సమాచారం.

చంద్రబాబు పది కోట్లు ఇచ్చినా వద్దంటున్న టీడీపీ ఎమ్మెల్యే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts